: హైదరాబాదులో ఫ్యాకల్టీ వార్... నారాయణ కళాశాలపై కేసు పెట్టిన 'వెలాసిటీ' కాలేజ్ యాజమాన్యం
హైదరాబాదులో ఫ్యాకల్టీ వార్ పోలీస్ స్టేషన్ కు చేరింది. అచ్యుతరావు అనే లెక్చరర్ ను హైదరాబాదులోని వెలాసిటీ కాలేజ్ 1.8 కోట్ల రూపాయల వేతనం ఒప్పందంతో విధుల్లోకి తీసుకుంది. 50 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అయితే, పది రోజులు పని చేసిన అచ్యుతరావును నారాయణ కళాశాల తీసుకెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహం చెందిన వెలాసిటీ కాలేజ్ యాజమాన్యం నారాయణ కళాశాల యాజమాన్యంపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాత్రికి రాత్రే ఆయనను కిడ్నాప్ చేసి, తీసుకెళ్లిపోయారని, ఇప్పుడు ఆయనను హైదరాబాదుకు రానీయడం లేదని, సదరు అచ్యుతరావును తమ ఒప్పందం తీరకుండా తీసుకెళ్లిపోవడం అన్యాయం అని వెలాసిటీ యాజమాన్యం మండిపడుతోంది. అయితే తాము ఎవరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లలేదని, ఆయన గతంలో తమ కళాశాలలో పని చేశారని, మళ్లీ తమ కళాశాలలో చేరారని నారాయణ కాలేజీ వివరణ ఇచ్చింది.