: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబును ప్రజలు నిలదీసే రోజులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇచ్చిన హామీలను మరచిన బాబును ప్రజలు తరిమికొడతారని, రెండేళ్ల పాలనలో అవినీతి తప్ప, రాష్ట్రానికి ఆయన ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో పశ్చిమగోదావరి జిల్లాను బాబు నిలువునా మోసం చేశారని ఆళ్ల నాని తీవ్ర ఆరోపణలు చేశారు.