: చంద్ర‌బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన బొత్స


పాల‌న‌లో రెండేళ్లు పూర్తి చేసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంపై వైసీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు’ అని ఆయ‌న విమ‌ర్శించారు. ‘చంద్ర‌బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని చెప్పిన విష‌యం వాస్త‌వ‌మా.. కాదా..?’ అని ఆయ‌న అన్నారు. ‘నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్న విష‌యం వాస్త‌వ‌మా.. కాదా..?’ అని ప్ర‌శ్నించారు. ఇంత‌వ‌ర‌కు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారని బొత్స ప్రశ్నించారు. పోల‌వ‌రం ప‌నుల‌ని మూడేళ్ల‌లో పూర్తి చేస్తామ‌న్నారని, పోల‌వ‌రాన్ని ఎప్ప‌టికి పూర్తి చేస్తారని, ఆ బాధ్య‌త కేంద్రానిదా.. మీదా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ‘రైతుల‌కు వ‌డ్డీ భారం అయిందా.. లేదా..?’ అని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌త్యేక హోదాపై సాకులు చెబుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని బొత్స ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు పాల‌న అంతా అవినీతి, అరాచ‌కమ‌ని ఆయ‌న ఆరోపించారు. రెండేళ్ల‌లో ఏ ప్రాంతానికీ, ఏ వ‌ర్గానికీ న్యాయం జ‌ర‌గ‌లేదని అన్నారు.

  • Loading...

More Telugu News