: రంజాన్ నెల ఆరంభం రోజున రికార్డు స్థాయిలో భారీగా విద్యుత్ వినియోగించిన కువైట్


ముస్లిం సోద‌రుల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభం రోజున కువైట్ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో విద్యుత్ ను వినియోగించారు. నిన్న ఏకంగా మొత్తం 12,021 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించారు. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగులతో కువైట్‌లో రంజాన్ మాసాన్ని ఆహ్వానించారు. వేస‌వి కాలంలోనూ ఇంత‌టి భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం క‌నబ‌డలేదని అధికారులు చెప్పారు. అంతేకాదు, రంజాన్ ఆరంభం సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు నీటిని భారీగానే వినియోగించేశార‌ట‌. 4,41,298 మిలియన్ల ఇంపిరియల్ గాలన్ల నీటిని నిన్న ఒక్క‌రోజులోనే వినియోగించిన‌ట్లు అక్క‌డి అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News