: ముగిసిన టీజేఏసీ సమావేశం.. తమపై దాడులు జరిగినా ముందుకుసాగుతామన్న కోదండరాం
తమ భవిష్యత్ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై ప్రొ.కోదండరాం అధ్యక్షతన హైదాబాద్‌లో జరుగుతోన్న టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణలో మూతపడిన కంపెనీల పునరుద్ధరణ కోసం శ్రమిస్తామని అన్నారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీజేఏసీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకెళతామని పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. ప్రజలే తమకు ముఖ్యమని కోదండరాం అన్నారు. వారి కోసం పోరాడతామని తెలిపారు. కరవుకు సంబంధించిన మాన్యువల్‌లో సవరణ రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యారంగంలో చాలా సమస్యలున్నాయని ఆయన అన్నారు. ‘యూనివర్సిటీలకు వీసీలు లేరు, టీచింగ్ స్టాఫ్ లేద’ని ఆయన వ్యాఖ్యానించారు. తమపై దాడులు జరిగినా ముందుకెళతామని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలు బలపేతం కావాలని, ఉచిత విద్య అమలు కావాలని ఆయన అన్నారు.