: పోరుబాటకే జైకొట్టిన టీ జేఏసీ!.. ప్రజల పక్షాన పోరాటమే లక్ష్యమని సంచలన ప్రకటన!
టీఆర్ఎస్ సర్కారుపై పోరు సాగించేందుకే తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) తీర్మానించింది. నేటి ఉదయం ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాదులో భేటీ అయిన టీ జేఏసీ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రజల పక్షాన పోరాడటంతో పాటు ప్రజలకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి చేస్తామని కూడా జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. వెరసి టీ జేఏసీ, టీఆర్ఎస్ సర్కారుల మధ్య పొడచూపిన విభేదాలపై ఆ ఉద్యమ సంస్థ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. టీ జేఏసీ కీలక నిర్ణయాలతో భవిష్యత్తులో తెలంగాణలో ప్రజల పక్షాన ఉద్యమం మరింత తీవ్రం కానుందన్న వాదన వినిపిస్తోంది.