: ఎన్ఎస్జీ సభ్య దేశంగా భారత్!... అమెరికా మద్దతుతో ఎంపిక లాంఛనమే!
అణు సరఫరా దేశంగా భారత్... ప్రపంచంలో మరింత కీలక దేశంగా అవతరించనుంది. ఇప్పటికే అణు సరఫరా దేశాల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం ఇండియా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ఎస్జీ కూటమిలోని దేశాల మద్దతును కూడగట్టారు. ఈ క్రమంలో నిన్న అమెరికాలో కాలుపెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. అదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ఓ కీలక అధికారి నిన్న బహిరంగ ప్రకటన చేశారు. అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా మద్దతు లభించిన నేపథ్యంలో భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వం లభించడం ఇక లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది.