: రేపు ఉదయం పది గంటలకు తెలంగాణ జేఏసీ మీటింగ్
రేపు ఉదయం తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుందని ప్రతినిధులు తెలిపారు. హైదరాబాదులో తెలంగాణ ప్రజాసంఘాలు సమావేశమైన సందర్భంగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై కేబినెట్ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ జేఏసీ అనేది లేదని, అది అంతర్థానమైంది అన్న కేబినెట్ మంత్రుల వ్యాఖ్యల నడుమ తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అవుతుందని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. మరి దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.