: రూ. 10,000 నోట్ల కట్ట నోటకరుచుకుని కోతి... దాని వెనుకే నగల షాపు సిబ్బంది!


గుంటూరులోని ఓ నగల దుకాణంలోని సిబ్బంది మొత్తాన్ని ఓ కోతి హడలగొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరులోని ఓ నగల దుకాణం దగ్గర పచార్లు చేస్తున్న కోతిని చూసి షాపులోని వ్యక్తి దానికి పళ్లు అందించాడు. వాటిని ఆరగించిన కోతి, నెమ్మదిగా తలుపు తీసుకుని షాపులో దూరింది. ఎవరి పనుల్లో వారు ఉండడంతో దానిని ఎవరూ పట్టించుకోలేదు. తీరా సిబ్బంది గమనించే సరికి షాపులోని క్యాష్ కౌంటర్ లోని సొరుగు తీసి, అందులో ఓ 10,000 రూపాయల కట్ట నోట కరుచుకుని పరుగులంకించుకుంది. దీంతో షాపు సిబ్బంది దానిని వెంబడించారు. దానికి తినడానికి ఏమిచ్చినా ఆ డబ్బును మాత్రం వెనక్కి ఇవ్వకపోవడం విశేషం. కాగా, ఈ తతంగం మొత్తం షాపులోని సీసీకెమెరాలో నిక్షిప్తం కావడంతో వాటిని ఆ షాపు వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కోతి దొంగతనం పేరిట ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News