: రాష్ట్రపతి వద్దకు ఏపీ ‘స్థానికత’ దస్త్రం


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు ఏపీ ‘స్థానికత’ దస్త్రం చేరింది. రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం స్థానికత దస్త్రాన్ని కేంద్రం పంపింది. కాగా, స్థానికతపై గత ఏడాది అక్టోబర్ 9న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. విభజన చట్టం ఆధారంగా స్థానికత అంశాన్ని త్వరలో తేల్చాలని ఆ లేఖలో కోరింది. రాష్ట్ర విభజన తేదీ నుంచి మూడేళ్లలో తెలంగాణ నుంచి నవ్యాంధ్రకు తరలి వెళ్లే కుటుంబాలందరికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News