: రాగల 72 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 72 గంటల్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వడగళ్లతో వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.