: దటీజ్ కిరణ్ బేడీ...వైరల్ అవుతున్న వీడియో


మహిళా ఐపీఎస్ గా దేశంలోని జైళ్లలో సంస్కరణలు తెచ్చిన కిరణ్ బేడీ ఇటీవల పుదుచ్చేరి గవర్నర్ గా నియమితులైన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆమెను పుదుచ్ఛేరి ఎమ్మెల్యేలంతా మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయవాణి ఆమెను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ కాళ్లకు ఆమె నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెను పైకి లేపిన గవర్నర్ అలా ఎవరి కాళ్లకూ నమస్కరించవద్దని, మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని, ఇంకెప్పుడూ అలా చేయవద్దని సూచించారు. ఆమె సరే అనేంతలో కిరణ్ బేడీ వంగి ఆమె కాళ్లకు నమస్కరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతయింది. ఇప్పుడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, పుదుచ్ఛేరిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుదామని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. దీంతో 'దటీజ్ కిరణ్ బేడీ' అంటూ నెటిజన్లు ఆమెపై అభిమానం చాటుకుంటున్నారు.

  • Loading...

More Telugu News