: గాయమవ్వడం నిజమే...ఇప్పుడు కోలుకున్నాను!: రకుల్ ప్రీత్ సింగ్


టాలీవుడ్ హార్ట్ థ్రోబ్ రకుల్ ప్రీత్ సింగ్ కాలికి గాయమైందని, వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మన్నారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించింది. తనకు గాయమవ్వడం వాస్తవమేనని, అయితే అది కాలికి, భుజానికి కాదని స్పష్టం చేసింది. సైమా అవార్డు వేడుకలో పాల్గొనేందుకు విమానమెక్కేందుకు వేగంగా వెళ్లే ప్రయత్నంలో రకుల్ ప్రీత్ పట్టుతప్పి కిందపడిపోయింది. అలా కిందపడే క్రమంలో మెడకు గాయమైందని తెలిపింది. ఇప్పుడు చాలా వరకు కోలుకున్నానని, షూటింగ్ కు కూడా వెళ్తున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News