: కోదండరామ్‌పై ప్రతి విమర్శలు వద్దు: టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచన
ప్రొఫెసర్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మూకుమ్ముడిగా విమర్శలు చేస్తుండడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేధావి కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సర్కార్ స్వీకరించి, ప్రభుత్వపాలన కొనసాగించాలని ఆయన అన్నారు. కోదండ రామ్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ టీఆర్ఎస్ చేస్తోన్న ప్రతివిమర్శలు ఇక ఆపేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ ను తాము గతంలో రాజకీయాలకు అతీతంగా జేఏసీ కన్వీనర్‌గా ఎన్నుకున్నామని ఆయన అన్నారు.