: 1311 ఏళ్ల నాటి హోటల్ ఇంకా నడుస్తోంది!
జపాన్ లోని ఓ హోటల్ కు 1311 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక కుటుంబంలోని 52 తరాలను ఆ హోటల్ చూసింది. రాజులు, సేనాధిపతులకు ఆతిథ్యమిచ్చిన ఆ హోటల్ ఇప్పుడు పర్యాటకులకు ఆతిథ్యమిస్తోంది. జపాన్ లోని నిషియమా అన్ సెన్ కియున్ కన్ హోటల్ ను క్రీస్తుశకం 705వ సంవత్సరంలో అప్పటి జపాన్ రాకుమారుడు పుజివరా మహితో ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ హోటల్ ఆ కుటుంబంలోని 52 తరాలను చూసింది. ఇప్పటికీ పర్యాటకులకు ఆతిథ్యమిస్తూ గిన్నిస్ ప్రపంచ రికార్డు పుస్తకంలో చోటుసంపాదించుకుంది. ప్రస్తుతం ఈ హోటల్ లో 37 గదులు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈత కొలను ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఈ హోటల్ ను విలాసవంతంగా మార్చారు. అప్పటి నుంచి దీనికి పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన హోటల్ లో ఆతిథ్యం స్వీకరించే పర్యాటకులు దీని చరిత్ర తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.