: కోదండ రామ్ పై విమర్శలా..? టీఆర్ఎస్ నేతలకు షోకాజ్ నోటీసులివ్వాలి: రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమ కీలక నాయకుడు కోదండ రామ్ ప్రభుత్వ పాలనపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ టీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించిన అంశంపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు కోదండ రామ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కి స్పందిచాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ‘ఎటువంటి భావజాలంతో బంగారు తెలంగాణ సాధించుకోవాలి..?’ అనే విషయంపై తెలంగాణ ఉద్యమకారులు ఓ అభిప్రాయానికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కోదండ రామ్‌ని తిట్టిన టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ షోకాజ్ నోటీసులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.