: తుని కేసులో మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తునిలో విధ్వంసం సృష్టించి, రైలుని తగలబెట్టిన కేసులో ఈరోజు ఉదయం సీఐడీ పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. తుని సంఘటనలో వందలాది నిందితులను గుర్తించిన సీఐడీ పోలీసులు నిన్న ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు తుని ఘటనకు తానే కారణమని, తనని మాత్రమే అదుపులోకి తీసుకోండంటూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, ముద్రగడను అరెస్టు చేసే అంశంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.