: సీఐడీ ఆఫీస్ కు రావాలన్న ‘తూర్పు’ ఎస్పీ!... నేరస్తుల వ్యాన్ లో అయితేనే వస్తానన్న ముద్రగడ!
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తుని విధ్వంసకారులంటూ పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు కాపు యువకులను విడిచిపెట్టాలని, ముందుగా తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ కొద్దిసేపటి క్రితం ముద్రగడతో ఫోన్ లో మాట్లాడారు. కేసు సీఐడీ పరిధిలో ఉన్నందున జిల్లా కేంద్రం కాకినాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆయన ముద్రగడను కోరారు. అందుకు సరేనన్న ముద్రగడ ఓ షరతు పెట్టారు. నేరస్తులను తరలించే వాహనంలో అయితేనే తాను అమలాపురం పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీ కార్యాలయానికి వస్తానని ముద్రగడ పెట్టిన షరతుతో ఏం చేయాలో పాలుపోని ఎస్పీ... ఆయనకు సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు.