: మీడియా కెమెరాలకు చిక్కకుండా ముఖం కప్పుకున్న కళానికేతన్ డైరెక్టర్
తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్నా ధర్మవరంలో పట్టు చీరల తయారీనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులను వంచించిన కేసులో అరెస్టయిన కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీశారద మీడియా కెమెరాలకు తన ముఖం కనపడనీయలేదు. ఈ ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచిన సంగతి విదితమే. కోర్టులో న్యాయమూర్తి ముందు సంతకం పెడుతున్న సందర్భంగా మీడియా కెమెరాలను చూసిన ఆమె... తన ముఖం కనపడనీయకుండా, నిండా ముసుగేసుకుని మరీ సంతకం చేసింది.