: రైలు దహనం కేసులో తనను ఏ1గా పెట్టాలని ముద్రగడ డిమాండ్... ఉన్నతాధికారులను అడిగి చెబుతామన్న పోలీసులు


తునిలో జరిగిన రైలు దహనం కేసులో తనను ఏ1గా పెట్టాలని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తుని ఘటనలపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తున్న వేళ, ముద్రగడ ఆందోళనకు దిగారు. కాపు సోదరులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని హెచ్చరించిన ఆయన, తొలి ముద్దాయిగా తన పేరు పెట్టి, తనను అరెస్ట్ చేసిన తరువాత మాత్రమే ఇతరులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై తాము ఉన్నతాధికారులను అడిగి చెబుతామని అమలాపురం పోలీసులు ముద్రగడకు తెలిపారు. అప్పటివరకూ తమ విధులకు అడ్డురారాదని తెలిపారు. ముద్రగడ వెంట భారీ ఎత్తున అనుచరులు సైతం ఆందోళనకు దిగడంతో అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News