: బాత్ రూములో దాక్కున్న కళానికేతన్ డైరెక్టర్ శారద... తలుపులు పగులగొట్టి అరెస్ట్
పలు పట్టణాల్లో వస్త్ర వ్యాపార సంస్థలను కళానికేతన్ పేరిట నిర్వహిస్తున్న లీలా ప్రసాద్ భార్య, కళానికేతన్ లో డైరెక్టరుగా ఉన్న లక్ష్మీ శారదను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ లోని ఫిలింనగర్ సినారీ వ్యాలీలో అరెస్ట్ అయ్యారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలో 80 మందికి పైగా చేనేత వస్త్రాల తయారీదారుల నుంచి రూ. 9 కోట్ల విలువైన వస్త్రాలు కొనుగోలు చేసి, వారికి డబ్బు ఎగ్గొట్టినట్టు వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. కేసును నమోదు చేసిన ధర్మవరం పోలీసులు, కళానికేతన్ ఎండీ, అతని భార్యల తప్పుందని తేల్చి వారిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. పోలీసుల రాకను గమనించిన లీలా ప్రసాద్ తప్పించుకుపోగా, శారద ఇంటి బాత్ రూములో దాక్కున్నారు. ఎంతసేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో, విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులకు చెప్పి, వారి సమక్షంలో తలుపులు పగులగొట్టి ఆమెను అరెస్ట్ చేశారు.