: శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరిన నన్నపనేని రాజకుమారి


తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారికి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బంధువులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెకు, గత రాత్రి సమస్య తీవ్రతరంకాగా, గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి చినరాజప్ప ఆమెను పరామర్శించి, వివరాలు అడిగారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News