: విజయవాడకు స్మృతీ ఇరానీ
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోదీ సర్కారు తలపెట్టిన 'వికాస్ పర్వ్'లో భాగంగా, తాము చేసిన అభివృద్ధిని గురించి వివరించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ నేడు విజయవాడకు రానున్నారు. ఈ ఉదయం విజయవాడకు చేరుకునే ఆమె, ఉదయం 11:30 గంటల సమయంలో వన్ టౌన్ పరిధిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని కాలేజీ విద్యార్థులతో ఆమె ముఖాముఖి జరపనున్నారు. ఆపై భోజన విరామానంతరం, సాయంత్రం 4 గంటలకు ఓ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.