: కొత్త జిల్లాల ఏర్పాటుతో మూడు ముక్కలు కానున్న హైదరాబాద్!


కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తెలుగు రాష్ట్రాల రాజధాని నగరం హైదరాబాద్ మూడు ముక్కలు కానుంది. హైదరాబాద్ కేంద్రానికి తూర్పు, ఉత్తరాన విస్తరించిన ప్రాంతాన్ని సికింద్రాబాద్ జిల్లాగాను; పడమర, దక్షిణ భాగాన విస్తరించిన ప్రాంతాన్ని గోల్కొండ జిల్లాగానూ మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే భూ పరిపాలనా విభాగం చేసిన కసరత్తు పూర్తికాగా, కొత్త జిల్లాలపై నమూనా మ్యాప్ లు సిద్ధమైనాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో నేటి నుంచి రెండు రోజుల పాటు కొత్త జిల్లాలపై కలెక్టర్లతో వర్క్ షాప్ జరగనుండగా, 14 నుంచి 15 వరకూ కొత్త జిల్లాలు ఉండవచ్చని సమాచారం. మొత్తం మీద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నాలుగు జిల్లాలు కానున్నాయని, రంగారెడ్డిలోని వికారాబాద్ పట్టణం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడుతుందని సమాచారం. ఇక ఖమ్మంలో భద్రాద్రి జిల్లా (కొత్తగూడెం), ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల కేంద్రంగా కొమరం భీం జిల్లా, వరంగల్ జిల్లా భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ జిల్లా, నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు రానున్నాయని సమాచారం. ఇదే సమయంలో కరీంనగర్ జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టే అంశాన్నీ ఈ వర్క్ షాప్ లో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News