: వీరప్పన్ పై పుస్తకం రాస్తున్న మాజీ పోలీసు అధికారి
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై మాజీ ఐపీఎస్ అధికారి కె.విజయ్ కుమార్ పుస్తకం రాస్తున్నారు. వీరప్పన్ ను పట్టుకునేందుకు గతంలో ఆపరేషన్ కుకూన్ కు ఆయన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీరప్పన్ ను ఎలా చంపారనే విషయం అందరికీ కూలంకషంగా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాస్తున్నట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, స్మగ్లర్ వీరప్పన్ వందల కోట్ల రూపాయల విలువ చేసే ఏనుగు దంతాలను అక్రమంగా తరలించాడు. ఈ క్రమంలో సుమారు రెండొందల ఏనుగులను వేటాడటంతో పాటు పోలీసులు, అటవీశాఖాధికారులను కూడా హతమార్చాడు.