: స్విస్ నుంచి అమెరికా బయల్దేరిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన ముగిసింది. నేటి ఉదయం స్విస్ లో అడుగుపెట్టిన మోదీ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై ఆయనతో మాట్లాడారు. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో భారత్ చేరేందుకు మద్దతివ్వాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించారని మోదీ ప్రకటించారు. అనంతరం జెనీవా నుంచి ఆయన నేరుగా అమెరికా బయల్దేరారు. రేపు ఆయన అమెరికా అధ్యక్షుడ్ని కలవనున్నారు. మోదీ అధికారం చేపట్టిన రెండేళ్లలో ఒబామాను కలవడం ఇది ఆరోసారి. జూన్ 8న ఆయన యూఎస్ కాంగ్రెస్ లో ప్రసంగించనున్నారు.