: చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తా: సీఎం చంద్రబాబు
పేదరికం లేకుండా చేసేందుకు తన చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేశంగా అన్నారు. విజయవాడలో ఐదో రోజు నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పేదరికం తన కులమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటి కంటే ఎక్కువగానే చేస్తున్నానని, ఏపీ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నానన్నారు. ఏపీ అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదామని, ముందుకు తీసుకువెళదామని అన్నారు. అయితే, ఏపీ అభివృద్ధి జరగకుండా ఉండేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.