: ఐఎస్ఐఎస్ ఘాతుకం... 19 మంది బాలికల సజీవ దహనం!
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తాజాగా మరో ఘాతుకానికి పాల్పడింది. మహిళలను సెక్స్ బానిసలుగా మార్చుకుంటున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, తమ కోరిక తీర్చలేదన్న కారణంతో 19 మంది బాలికలను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసూల్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సెక్స్ బానిసలను వేలం వేసే ప్రాంతంలో వీరందరినీ లైంగికంగా లొంగిపోవాలని ఆదేశించారు. అందుకు అంగీకరించకపోవడంతో వారందరినీ ఓ ఇనుప చట్రంలో బంధించి, సజీవ దహనం చేశారు. నడిరోడ్డులో ఇంత ఘోరం జరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదని, బాలికల హాహాకారాలు మిన్నంటాయని కుర్దిష్ కు చెందిన వార్తా పత్రిక తెలిపింది.