: చర్చలకు అవకాశమివ్వని భారత్: పాక్ సలహాదారు సర్తాజ్ అజీజ్


శాంతి చర్చలు జరిపేందుకు భారత్ అవకాశమే ఇవ్వడం లేదని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆరోపించారు. పాకిస్థాన్ తో చర్చలు జరిగే అవకాశాలు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయంటూ భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా జియో ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, శాంతి చర్చలు తిరిగి జరిపేందుకు భారత్ అవకాశమివ్వకపోవడం వల్లే తాము ముందుకు రాలేకపోతున్నామన్నారు. పఠాన్ కోట్ సంఘటన కారణంగా డిసెంబర్ 9వ తేదీన జరగాల్సిన చర్చలు అలానే నిలిచిపోయాయని అన్నారు. ఉగ్రవాదం అణచివేతకు సంబంధించి అభివృద్ధి సాధిస్తే కనుక తమతో చర్చలు జరుపుతామని భారత్ అంటోందని, అయితే, చర్చల్లో అన్ని అంశాలతో పాటు ‘కాశ్మీర్’ అంశం కూడా ఉండాలని తాము అంటున్నామన్నారు. భారత్ తో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని సర్తాజ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News