: హైదరాబాద్ లో రెండు గంటలపాటు కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత
బ్రాడ్ కాస్టర్లు, ఎంఎస్ఓల బలవంతపు ఫీజు వసూళ్ల ఒత్తిడిని తట్టుకోలేక బీరంగూడ కేబుల్ ఆపరేటర్ రమేశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేశామని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరావు తెలిపారు. రాత్రి 8 గంటల వరకు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేస్తామని అన్నారు.