: సినీ పరిశ్రమను విశాఖకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: గంటా


హైదరాబాదులో ఉన్న సినీ పరిశ్రమను విశాఖపట్టణం తరలించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమ శ్రేయస్సుకోసం పలు విధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. ఏపీలో షూటింగుల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తరపున ప్రత్యేక అధికారిని నియమించిందని ఆయన చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు విశాఖపట్టణం కేంద్రం కానుందని ఆయన తెలిపారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News