: మమత సర్కార్ ను ప్రశంసలతో ముంచెత్తిన సీపీఎం


పశ్చిమ బెంగాల్ లోని మమత బెనర్జీ సర్కార్ ని అక్కడి ప్రతిపక్షం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలోని హాకర్లను రైల్వే అధికారులు ఖాళీ చేయించడంపై వామపక్షాలు మండిపడ్డ విషయం తెలిసిందే. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సబబు కాదంటూ మమత సర్కార్ కూడా దీనిని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సీపీఎం ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి తమ పార్టీ తరపున మమతా బెనర్జీకి ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ చర్యను మమత వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తుతించారు. మమతా బెనర్జీ గతంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే హాకర్ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైల్వే హాకర్లకు లైసెన్స్ లు, పునరావాసం కల్పించేందుకు ఆమె రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చర్చలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. రైల్వే హాకర్లకు లైసెన్స్ లు మంజూరు చేసేందుకు, పునరావాసం కల్పించే విషయమై ఆమె చొరవ చూపాలని కోరారు. అవసరమైతే, అన్ని పార్టీలను కూడగడతామని ఆ లేఖలో చక్రవర్తి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News