: పదివారాల పాటు ‘బాహుబలి-2’ క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తాం: నిర్మాత శోభు యార్లగడ్డ
ఈ నెల 13 నుంచి పది వారాల పాటు ‘బాహుబలి-2’ చిత్రం క్లైమాక్స్ భాగాన్ని షూట్ చేయనున్నట్లు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. స్నాప్ చాట్ లో ఇకమీదట తాము అందుబాటులో ఉంటామని, సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం జాతీయ అవార్డు విజేత అయిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా సెట్లను డిజైన్ చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, అప్పటినుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని చూస్తున్నామని తెలిపారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగితే 2017 ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు.