: 2002 గుజరాత్ అల్లర్ల కేసు: శిక్షల ఖరారు ఈనెల 9కి వాయిదా
గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న గుల్బర్గ్ సొసైటీ నరమేధం కేసులో 24 మందిని దోషులుగా నిర్ధారిస్తూ రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన సంగతి విధితమే. దోషులకు శిక్షల ఖరారు ఈరోజు చేయాల్సి ఉంది. అయితే, ఈ కేసులో శిక్షల ఖరారును ఈనెల 9కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఘర్షణలు చెలరేగిన 14 ఏళ్ల తరువాత రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు దోషులను నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. కేసులో విచారణ ఎదుర్కున్న 66 మందిలో 24 మందిని దోషులుగా పేర్కొన్న న్యాయస్థానం 36 మంది నిందితులని నిర్దోషులుగా విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు నిందితుల్లో ఈ కేసు విచారణ సమయంలో ఐదుగురు చనిపోగా, మరోవ్యక్తి కనిపించకుండా పోయాడు.