: సత్య నాదెళ్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బుగ్గ‌న‌


మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌ నాదెళ్ల‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ సీఈవో త‌న వ‌ల్లే ఐటీ చ‌దివార‌ని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఐటీపై చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్య‌లు వింటుంటే త‌న‌కు న‌వ్వొస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ప్రపంచానికి తానే ఐటీని నేర్పిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశార‌ని, సత్య నాదెళ్ల 1992లోనే మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరార‌ని బుగ్గ‌న పేర్కొన్నారు. స‌త్య‌ నాదెళ్ల త‌న వ‌ల్లే ఐటీలో రాణించార‌ని చంద్ర‌బాబు పేర్కొన‌డం హాస్యాస్ప‌దం అని ఆయ‌న అన్నారు. స‌త్య‌ నాదెళ్ల త‌న‌ను చూసే స్ఫూర్తిని పొందార‌ని చంద్రబాబు అంటున్నార‌ని, మ‌రి లోకేశ్ త‌న‌ను చూసి ఎందుకు స్ఫూర్తి పొంద‌లేదో చెప్పాల‌ని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు.

  • Loading...

More Telugu News