: మధుర అల్లర్లపై సుప్రీంలో పిటిషన్... రేపే విచారణ


దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్ లోని మధుర అల్లర్ల వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఓ ఎస్పీ స్థాయి అధికారి సహా 29 మంది మరణానికి కారణమైన ఈ అల్లర్లపై సీబీఐ చేత విచారణ చేయించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు దీనిపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించింది. మధుర నడిబొడ్డున ప్రభుత్వ పార్క్ ను స్వాధీనం చేసుకున్న కొన్ని అరాచన శక్తులు పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగిన సంగతి తెలిసిందే. పార్క్ లో ఆయుదాల తయారీ, శిక్షణ కొనసాగుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించినా అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వైనంపైనా పెను విమర్శలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో రేపు సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News