: తుని ఘటనలో తొలి అరెస్ట్... పోలీసుల అదుపులో రౌడీషీటర్ దూడల ఫణి
కాపు ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన రైలు దహనం, ఆపై జరిగిన విధ్వంసంలో సీఐడీ పోలీసులు తొలి అరెస్ట్ చేశారు. విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలను పరిశీలించిన అనంతరం, 10 మంది నిందితులను గుర్తించిన సీఐడీ బృందం రౌడీషీటర్ దూడల ఫణిని నేడు అదుపులోకి తీసుకున్నారు. రైలు దహనంలో ఫణి ప్రమేయం స్పష్టంగా ఉందని, ఇతర నిందితులు ఎక్కడి వారో ఫణిని విచారించడం ద్వారా తెలుసుకుంటామని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఇతని అరెస్టుతో కేసు దర్యాఫ్తు మరింత ముమ్మరం అవుతుందని వారు తెలిపారు.