: తెలుగులో ప్రమాణం చేసిన పుదుచ్ఛేరి మంత్రి మల్లాడి


పుదుచ్ఛేరిలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఆ ప్రాంతానికి మొన్న తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలోనే ఎన్నికలు జరిగాయి. మెజారిటీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితం పాండిచ్ఛేరిలో ఆ ప్రాంత లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ భేడీ... నారాయణ స్వామి చేత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ ఆసక్తికర పరిణామం కనిపించింది. ఏపీతో విడదీయరాని సంబంధాలున్న యానాం నుంచి ఎమ్మెల్యేగా మరోమారు ఎన్నికైన మల్లాడి కృష్ణారావు... నారాయణ స్వామి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళ భాషే ప్రధానంగా వినిపించే పుదుచ్ఛేరిలో మల్లాడి మాత్రం తన మాతృ భాష అయిన తెలుగులో ప్రమాణస్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News