: మధుర ఆయుధాగారంపై 40 ఐబీ నివేదికలు!... పట్టించుకోని అఖిలేశ్ సర్కారు!


ఉత్తరప్రదేశ్ లోని మధురలో చోటుచేసుకున్న అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య తాజాగా 29కి చేరింది. అసలు ఈ అల్లర్లు అఖిలేశ్ యాదవ్ సర్కారు ఉదాసీనత కారణంగానే చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అల్లర్లకు ప్రధాన వేదికగా నిలిచిన జవహర్ బాగ్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు, అక్కడ స్వాధీన్ భారత్ సుభాష్ సేన కార్యకర్తల ఆయుధ శిక్షణకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో దాదాపుగా 40 నివేదికలను యూపీ సర్కారుకు అందజేసింది. ఈ నివేదికలన్నీ చెత్త బుట్టల్లోకే చేరాయి తప్పించి, అఖిలేశ్ సర్కారు స్పందించిన పాపాన పోలేదు. ఇక పెనుముప్పుగా మారనున్న సుభాష్ సేనను నిలువరిచేందుకు జిల్లా యంత్రాంగం యత్నించినా, అవసరమైన బలగాలను సమకూర్చడంలో యూపీ సర్కారు ఆసక్తి చూపలేదు. ఈ కారణంగానే మధురలో సుభాష్ సేన కార్యకర్తలు ఏకంగా పోలీసు బలగాలపైనే విరుచుకుపడ్డారు. భారీ హింస చెలరేగింది.

  • Loading...

More Telugu News