: మావోయిస్టుల ఘాతుకం.. సర్పంచ్‌ను ఎత్తుకెళ్లి దారుణంగా చంపిన వైనం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కాంకేర్ జిల్లా కోరార్ ప్రాంతంలో ఘాతుకానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి అక్కడి మురాగావ్ సర్పంచ్ కుమార్‌సింగ్ గౌతంను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆయనను దారుణంగా చంపేశారు. మురాగావ్ సర్పంచ్‌ను మావోయిస్టులు తుపాకులతో కాల్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యతో మురాగావ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.