: విమానంలో కన్నయ్య కుమార్ పై దాడిచేసిన వ్యక్తి... అమిత్ షాను కలిశాడు!


కన్నయి కుమార్ పై విమానంలో దాడికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొన్న మనాస్ డేక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశాడు. పుణెలో జరిగిన 'ప్రమోద్ మహాజన్ స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మిషన్' కార్యక్రమంలో అమిత్ పాల్గొనగా, మనాస్ అక్కడే ఆయన్ను కలిసి సెల్ఫీలు దిగి, వాటిని తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశాడు. కాగా, తాను జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో పుణె నుంచి ముంబై ప్రయాణిస్తున్న సమయంలో మనాస్ డేక తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని కన్నయ్య కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తప్పని తేల్చారు. మనాస్, అమిత్ షాల చిత్రాలను చూసిన తరువాత కన్నయ్య స్పందిస్తూ, అతనో బలమైన బీజేపీ మద్దతుదారని తెలుస్తోందన్నారు.

  • Loading...

More Telugu News