: జల జగడంలో కత్తుల స్వైర విహారం!... పాతబస్తీలో పలువురికి గాయాలు!


నీటి కోసం మొదలైన వాదులాట క్రమంగా పెరిగింది. వాగ్వాదానికి దిగిన రెండు అపార్ట్ మెంట్లకు చెందిన ఇరు వర్గాల మధ్య పెను ఘర్షణ చోటుచేసుకుంది. ఉన్నట్టుండి రెండు వర్గాలకు చెందిన కొందరి చేతుల్లో కత్తులు ప్రత్యక్షమయ్యాయి. ఇరు వర్గాలు పరస్పరం కత్తులో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసుల రంగప్రవేశంతో ఆసుపత్రికి చేరారు. ఈ ఘటన నిన్న రాత్రి హైదరాబాదు పాతబస్తీకి చెందిన దారుల్ సిఫాలో చోటుచేసుకుంది. రెండు అపార్ట్ మెంట్లకు చెందిన వారి మధ్య నీటి విషయంలో చోటుచేసుకున్న వివాదం అక్కడ తీవ్ర కలకలమే రేపింది.

  • Loading...

More Telugu News