: మేమూ అధికారంలోకొస్తాం... చూస్కోండి!: ‘అనంత’ పోలీసులకు జగన్ వార్నింగ్!


అనంతపురం జిల్లాలోనే కాక ఏపీ వ్యాప్తంగా పెను రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర నిన్న ముగిసింది. యాత్ర ఆరంభం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన జగన్... నిన్న అనంతపురం జిల్లా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీ టీడీపీకి వత్తాసు పలుకుతున్న పోలీసులు తమ పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారన్న కోణంలో ఆరోపణలు గుప్పించిన జగన్... ప్రభుత్వాలు మారుతుంటాయన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వమే పట్టపగలు ఖూనీలు చేసే స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేసిన జగన్ రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జీ ప్రకాశ్ రెడ్డిని చంపాలని చూశారని ఆరోపించారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం ఉండదని వ్యాఖ్యానించారు. పోలీసులు మానవతా దృక్పథంతో పనిచేసి న్యాయాన్ని కాపాడాలన్నారు. ‘‘ప్రభుత్వాలు మారుతుంటాయి. మేమూ అధికారంలోకి వస్తాం. చూస్కోండి. జీతాలిస్తున్నది చంద్రబాబు కాదు. ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి’’ అని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News