: ఆ వ్యాపారవేత్త ఫోన్ కు రోజూ 300 మెస్సేజ్ లొస్తాయి!
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త సెల్ ఫోన్ కు రోజుకు 300 మెస్సేజ్ లు వస్తున్నాయట. అయితే, ఆ మెస్సేజ్ లలో కనీసం ఒక్కటి కూడా ఆయనకు సంబంధించింది కాదు. దీంతో, 'ఇదేమి గొడవ!' అనుకున్న ఆ వ్యాపారవేత్త అబ్దుల్ కరీమ్ ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకునే నంబర్ కు బదులుగా పొరపాటున అబ్దుల్ ఫోన్ నంబర్ ను ఆయా పోస్టర్లపై ముద్రించి వాటిని గోడలపై అంటించారు. దీంతో, ఆయన సెల్ కు మెస్సేజ్ ల మోత మోగిపోతోంది.