: ఆ షోకాజ్ నోటీసులను నేను లెక్కచేయను: కోమటిరెడ్డి వెంకటరెడ్డి


టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆ షోకాజ్ నోటీసులను తాను లెక్కచేయనని, పీసీసీకి షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం లేదని అన్నారు. టీఆర్ఎస్ లో చేరుతానని తాను చెప్పలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చిన పార్టీ నామరూపాలు లేకుండా పోతోందని, ఈ విషయాన్ని 16 మాసాల కిందటే తాను చెప్పానని, కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవ్వరికీ సరైన గౌరవం ఇవ్వరని ఆరోపించారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈరోజు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News