: ‘ఊపిరి’ సినిమా బాగా నచ్చింది: హీరో ఆది
తాను ఇటీవల చూసిన సినిమాల్లో ‘ఊపిరి’ తనకు బాగా నచ్చిన చిత్రమని హీరో ఆది అన్నాడు. అదేవిధంగా, ‘క్షణం’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు కూడా బాగున్నాయని అన్నారు. ఒక పెద్ద మాస్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇటువంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేయలేమని, ముఖ్యంగా ఇటువంటి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చేయడమనేది గొప్ప విషయమన్నాడు. ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాల గురించి కూడా చెప్పాడు. టెన్నిస్ అంటే ఇష్టమని, గోళ్లు కొరుక్కుంటూ టెన్నిస్ మ్యాచ్ లను చూస్తుండేవాడినని, ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా వీడియో గేమ్ లంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికి కూడా ఆడుతుంటానని ఆది చెప్పుకొచ్చాడు. తనకు చాలా ఇష్టమైన ఫుడ్ విషయానికొస్తే, వారానికొకసారైనా సరే, హైదరాబాద్ బిర్యానీ తింటానని, ప్రయాణాల విషయానికొస్తే, విదేశీయానాలంటే తనకు ఇష్టమని.. ముఖ్యంగా చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్లడాన్ని తాను ఇష్టపడతానని చెప్పాడు.