: ప్రాజెక్టులపై పట్టుదలకి పోతే ఏపీనే నష్టపోతుంది: మంత్రి తుమ్మల
ప్రాజెక్టులపై పట్టుదలకి పోతే ఏపీనే నష్టపోతుందని మంత్రి తుమ్మల అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నదీ జలాలు, ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. గతంలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కృష్ణా బోర్డు ఏకపక్ష నిర్ణయాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కృష్ణా బోర్డు కేవలం నీటి పంపకాలు మాత్రమే చేయాలని, తనకు అధికారంలేని అంశాల్లో కృష్ణా బోర్డు తలదూర్చుతోందని, గోదావరి, కృష్ణా నదుల్లో తమకు రావాల్సిన వాటాను వాడుకుంటామని తుమ్మల అన్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కృష్ణా బోర్డు ప్రవర్తిస్తోందని, గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులనే మేం పూర్తి చేస్తున్నామని, సున్నితమైన అంశాన్ని ఏపీ ప్రభుత్వం జటిలం చేయొద్దని, పోలవరం ప్రాజక్టుకు తాము వ్యతిరేకం కాదని చెప్పామన్నారు.