: సీనియర్ నటి శులభ దేశ్ పాండే కన్నుమూత


కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి శులభ దేశ్ పాండే (79) కన్నుమూశారు. ముంబైలోని స్వగృహంలో ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, శులభ సినీ, టీవీ, రంగస్థల నటి. మరాఠి, హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోను ఆమె నటించారు. మరాఠీ రంగస్థల సంస్థ రంగయాన్ తో కలిసి ఆమె పనిచేశారు. భర్త అరవింద్ దేశ్ పాండేతో కలిసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును ఆమె స్థాపించారు. 1987లో అరవింద్ దేశ్ పాండే మృతి చెందారు. హిందీలో పలు విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్, ఇంగ్లీష్-వింగ్లీష్ వంటి సినిమాల్లో ఆమె నటించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, తన్వీర్ సమ్మాన్, నానాసాహెబ్ పాఠక్ పురస్కార్ వంటి ఎన్నో పురస్కారాలు ఆమెకు లభించాయి.

  • Loading...

More Telugu News