: అంతర్వేదిలో లీకవుతున్న ఓఎన్జీసీ గ్యాస్... భయాందోళనల్లో ప్రజలు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి సమీపంలో ఓఎన్జీసీ 28వ గ్యాస్ బావి నుంచి ఈ ఉదయం సహజవాయువు లీక్ అవుతుండటాన్ని గమనించిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్ లీక్ ను గుర్తించిన ప్రజలు జీసీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వగా, నిపుణులతో కూడిన కమిటీతో వచ్చిన అధికారులు మరమ్మతులు చేపట్టారు. శనివారం సైతం మరో ప్రాంతంలో గ్యాస్ లీక్ అయిందన్న సంగతి తెలిసిందే. పైప్ లైన్లలో నాణ్యతా లోపాల కారణంగానే లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రజలు, ఓఎన్జీసీ అధికారుల తీరును విమర్శిస్తున్నారు.