: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతను దారుణంగా చంపి, తాపీగా లొంగిపోయిన నిందితులు
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతను దారుణంగా హత్య చేసిన నిందితులు తాపీగా పోలీసు స్టేషనుకు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు ఇందిర భర్త వెంకట్ ను ఓ పథకం ప్రకారం నిందితులు హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో, కలికిరి మండలం, కృష్ణారెడ్డి పాలెంలో వెంకట్ ను వెంబడించి, కత్తులతో నరికి చంపిన బాలకృష్ణారెడ్డి, అతని అనుచరులు, ఆపై పోలీసులకు విషయం చెప్పి లొంగిపోయారు. వీరిమధ్య భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.